బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్.. ఆయన ఎవరంటే..?

by Disha Web Desk 19 |
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్.. ఆయన ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత రావడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన చాలా మంది మంత్రులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, బ్రిటన్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునక్, బోరిస్ జాన్సన్‌ను విమర్శిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో రిషి సునక్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. బోరిస్ జాన్సన్ రాజీనామాతో ప్రధాని పదవి ఖాళీ అవ్వడంతో.. తదుపరి ప్రధానిగా చాలామంది కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా మాజీ మంత్రి రిషి సునక్ పేరు వినిపిస్తుంది. రిషి సునక్‌తో పాటు లిజ్ ట్రస్, బెన్ వాలెస్, జెరెమీ హంట్‌ల పేర్లు తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నాయి. కాగా, రిషి సునక్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తికి స్వయాన అల్లుడు కావడం విశేషం.



Next Story

Most Viewed