హెలీనా మిస్సైల్ పరీక్ష విజయవంతం

by Harish |
హెలీనా మిస్సైల్ పరీక్ష విజయవంతం
X

న్యూఢిల్లీ: భారత్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ హెలీనాను విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పోఖ్రాన్ లో జరిగిన ఈ పరీక్ష విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన మూడవ తరం 'ఫైర్ అండ్ ఫర్‌‌గెట్' క్లాస్ క్షిపణుల యూజర్ ధ్రువీకరణ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్ష జరిగింది. భారత ఆర్మీ, వాయుసేనతో పాటు డీఆర్డీవో లు సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్వదేశీ అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ల(ఏఎల్‌హెచ్) ద్వారా ఈ ట్రయల్స్ నిర్వహించారు. క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక యాంటీ-ట్యాంక్ ఆయుధమని డీఆర్డీవో పేర్కొంది.

అంతేకాకుండా ఏడు కిలోమీటర్ల గరిష్ట సుదూర లక్ష్యాలను చేధించే విధంగా దీనిని రూపొందించారు. పోఖ్రాన్‌లో నిర్వహించిన ట్రయల్స్‌కు కొనసాగింపుగా, వివిధ ఎత్తుల్లో ఏఎల్ హెచ్ సమర్థతను నిరూపిస్తుంది. ఈ ట్రయల్స్‌ను సీనియర్ ఆర్మీ కమాండర్లు మరియు DRDO సీనియర్ శాస్త్రవేత్తలు చూశారు' అని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హెలీనాను హైదరాబాద్ డీఆర్డీవో లాబోరేటరీ అభివృద్ధి చేసింది.

Next Story

Most Viewed