వ్యాక్సినేషన్ పెంచాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం లేఖ

by Disha Web Desk |
వ్యాక్సినేషన్ పెంచాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం లేఖ
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం మరోసారి అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివ్ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా నమోదు అవుతుండడంతో కేంద్రం ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుతో పాటు తెలంగాణ రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో, కరోనా నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హతగల వారి కోసం వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచడం, ఐదు విధానాల వ్యూహాన్ని పాటించడం, కోవిడ్ నియంత్రణకు కట్టుబడి ఉండటం లక్ష్యంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో ఒక్కరోజుల్లో 19,406 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అదే సమయంలో 49 మంది వైరస్ బారిన పడి మరణించారు. అయితే దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.63గా ఉంది. యాక్టివ్ కేసుల పరంగా ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.


Next Story

Most Viewed