TS SI పరీక్ష రాస్తున్నారా.. ఈ సూచనలు తప్పక తెలుసుకోండి

by Dishanational2 |
TS SI పరీక్ష రాస్తున్నారా..  ఈ సూచనలు తప్పక తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పోలీసు కొలువులకు వేళాయింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష సమయం ఆసన్నం అయ్యింది. ఆదివారం ఆగస్టు7న పరీక్ష జరగనుంది. దీంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలంట. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష రాసే వారు సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ బ్లుటూత్, వాచ్, క్యాలిక్యులేటర్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రిడింగ్ పరికరాలు తీసుకెళ్లరాదు. అలాగే మహిళలు నగలు ధరించరాదని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్ట్ స్పష్టం చేసింది.

  • అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే సెంటర్లలోకి తీసుకెళ్లాలి.

  • ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో.. బయోమెట్రిక్‌ నేపథ్యంలో అభ్యర్థులు తమ చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • గంట ముందే పరీక్షా హాల్‌కు చేరుకోవాలి.

Next Story