చైనా రుణాలపై నిషేధం విధించండి : ఐఎంఎఫ్

by Disha Web |
చైనా రుణాలపై నిషేధం విధించండి : ఐఎంఎఫ్
X

ఇస్లామాబాద్: చైనా నుంచి ఇకపై ఎలాంటి రుణాలను పాకిస్తాన్ తీసుకోకుండా నిషేధించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భావిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే 350 బిలియన్ రూపాయలను చైనాకు చెందిన వివిధ కంపెనీలకు చెల్లించాల్సిన పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టుల కోసం తాజాగా మరో 7.9 బిలియన్ పాక్ రూపాయలను చైనానుంచి రుణంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే విదేశీ రుణాల సహాయంతో ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం పాకిస్తాన్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదని పైగా పాకిస్తాన్ సమూలంగా సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో చైనానుంచి రుణాలు తీసుకోవడం, చైనాకు చెందిన స్వతంత్ర విద్యుత్ ఉత్పాదక సంస్థలకు అధిక వడ్డీలతో చెల్లింపులు చేయడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టుల ఒప్పంద షరతులను సవరించాలని ఐఎంఎఫ్ చేసిన డిమాండ్లను చైనా పెడచెవిన పెట్టింది. పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ (47.5 బిలియన్ డాలర్లు)లో 40 శాతంకంటే ఎక్కువ భాగం రుణ చెల్లింపులకో సరిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణచెల్లింపుల్లో 29.1 శాతం పెరుగుదల నమోదైంది.

2022-23 పాకిస్తాన్ వార్షిక బడ్జెట్ కీలకమైన వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పి దివాలా అంచుల్లో ఉన్న పాకిస్తాన్ ఐఎమ్ఎఫ్ షరతులకు ఒప్పుకుని రుణాలు తీసుకుంటే సంస్థాగత సంస్కరణలను దూకుడుగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్‌లో అధికభాగం ఇప్పటికే రుణ చెల్లింపులకే కేటాయిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని పాక్ మీడియానే చెబుతుండటం విశేషం.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed