ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా?.. ఈ జ్యూస్‌ తాగండి!

by Disha Web Desk 4 |
ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా?.. ఈ జ్యూస్‌ తాగండి!
X

దిశ, ఫీచర్స్: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. కాల్షియం, విటమిన్ 'డి' లోపించడమే ఇందుకు ముఖ్య కారణం కాగా క్రమం తప్పని వ్యాయామంతో పాటు స్మోకింగ్‌‌ అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు. ఇక విటమిన్‌, మినరల్స్‌ సప్లిమెంట్లను తీసుకుంటూ ఫాస్పరస్‌, విటమిన్‌ 'సి' పుష్కలంగా లభించే పండ్ల రసాలు సేవించాలి. ఇంతకీ ఎముక బలానికి తోడ్పడే జ్యూస్‌లు ఏంటో చూద్దాం..

* ఆకు కూరల జ్యూస్‌: ముదురు ఆకుపచ్చ రంగు ఆకు కూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పాలకూర, కాలే రెండింటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే ఆకుకూరల జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ జ్యూస్‌లో అరటిపండు, కమల వేస్తే ఇంకా మంచిది. అలాగే ఆకు వగరు తెలియకుండా ఉంటుంది.

* ద్రాక్ష రసం: ద్రాక్ష రసం తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. ద్రాక్ష రసంలో అధిక మొత్తంలో విటమిన్‌ 'సి' ఉంటుంది. ఇది ఎముకల లోపల కొల్లాజెన్‌ ఉత్పత్తికి సాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతుంది. ఇక ద్రాక్ష పండు ఎముకల్లో గుజ్జు నాణ్యతను మెరుగుపరుస్తుంది. మరొక అధ్యయనంలో ద్రాక్ష రసం తాగడం వల్ల ఎముక నాణ్యత, ఎముక మినరల్ కంటెంట్ పెరుగుతుందని వెల్లడైంది.

* కేఫీర్ మిల్క్‌: పాలంటే ఇష్టంలేనివారికి కేఫీర్ మిల్క్‌ బెస్ట్‌ ఆప్షన్‌. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఆరు నెలల పాటు కేఫీర్‌ మిల్క్‌ తాగిన వారికి ఎముకలు బలంగా మారతాయి.

* బాదం, సోయా పాలు: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు బాదం, సోయా పాలు తాగితే చాలా మంచిది. వీటిలో కాల్షియం, విటమిన్‌ 'డి' పుష్కలంగా లభిస్తాయి.

* పాశ్చరైజ్ పాలు: పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే పాశ్చరైజ్ పాలలో కాల్షియం, విటమిన్ 'డి' సమృద్ధిగా లభిస్తాయి. శరీరానికి తగినంత విటమిన్‌ 'డి' లభిస్తే.. కాల్షియం శోషణ జరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ పాలు తాగడం మంచిది.



Next Story

Most Viewed