ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు ఉంటే చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

by Disha Web Desk |
ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు ఉంటే చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోకాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ వీడియో ఫేక్ అని ఆరోపిస్తున్నప్పటికీ విపక్షాలు ఆయనన్న టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ వీడియో వైరల్‌గా మారడంతో వైసీపీ అధిష్టానం దృష్టికి ఈ వ్యవహారం చేరింది. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ హల్‌చల్ చేస్తున్న వీడియో వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని ఎంపీ గోరంట్ల మాధవ్ తనతో చెప్పారని సజ్జల వివరణ ఇచ్చారు. ఈ వీడియో వ్యవహారంలో ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed