పాన్ ఇండియా ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి

by Javid Pasha |
పాన్ ఇండియా ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన అనిల్  రావిపూడి
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్లంతా ప్రస్తుతం సరికొత్త, వినూత్న కథలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటుగానే తమ కథను పాన్ ఇండియా రేంజ్ మూవీ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా వీరిలో అనిల్ రావిపుడి కూడా చేరాడని, నెవ్వర్ బిఫోర్ అనేలా ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడంటూ వార్తలో సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. అనిల్, బాలయ్య కాంబోలో రానున్న మూవీని దర్శకనిర్మాతలు పాన్ ఇండియా రేంజ్‌లో రెడీ చేస్తున్నారని, ఇందులో యాక్షన్, కామెడి, థ్రిల్ ఇలా నవరసాలకు కొదవలేకుండా ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా అనిల్ స్పందించాడు. తాను ఎటువంటి పాన్ ఇండియా సినిమా చేయడం లేదని, కాదని తన స్టైల్‌లో మాత్రం ఓ సినిమాను పక్కా పైసా వసూల్‌గా రెడీ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. అనిల్ తన మూవీపై భారీ క్లారిటీ ఇవ్వడంతో బాలయ్యతో అతడు చేసే సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అని అభిమానులు ఉంటున్నారు. మరి అనిల్ తన సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.



Next Story

Most Viewed