హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి బదిలీ

by Jakkula.Mamatha |

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ప్రభుత్వ వైద్యుల బదిలీల పర్వంలో భాగంగా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కీలక మార్పు చోటుచేసుకుంది.

హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి బదిలీ
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ప్రభుత్వ వైద్యుల బదిలీల పర్వంలో భాగంగా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇక్కడ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఆయనను మహబూబ్‌నగర్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

​ఇంచార్జ్‌గా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి..

​నారాయణరెడ్డి బదిలీ అయినప్పటికీ, హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి కొత్త సూపరింటెండెంట్‌ను నియమించలేదు. దీంతో ఆస్పత్రి పరిపాలన పనులకు, వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడి సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనే ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా కొనసాగనున్నారు. ​గత రెండు, మూడు రోజులుగా వైద్యారోగ్య శాఖలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీల ప్రక్రియ నడుస్తోంది.

​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేస్తున్న ​ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు ​సివిల్ సర్జన్లు, స్పెషలిస్ట్ వైద్యులు ​ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిని ​ప్రభుత్వం విస్తృతంగా బదిలీ చేస్తుంది. పరిపాలనా సౌలభ్యం, సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కల్పించడంలో భాగంగానే ఈ బదిలీల ప్రక్రియ సాగుతున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి త్వరలోనే పూర్తిస్థాయి కొత్త సూపరింటెండెంట్‌ను కేటాయించే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Next Story