పెళ్లైన నాటి నుంచి భర్త అదే పనిగా టార్చర్.. తట్టుకోలేని భార్య అర్ధరాత్రి బెడ్‌రూంలోనే..

by Disha Web |
పెళ్లైన నాటి నుంచి భర్త అదే పనిగా టార్చర్.. తట్టుకోలేని భార్య అర్ధరాత్రి బెడ్‌రూంలోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి అంటే ఓ నమ్మకం... భరోసా. ఆలుమగలు ఇద్దరు ఒకరికొకరు తోడునీడగా కలిసి నడిస్తేనే సంసారం. ఒకరి మాటకు మరొకరు విలువు ఇస్తేనే కాపురం సజావుగా సాగుతుంది. అయితే ఇటీవల జరుగుతున్న వివాహాల్లో భార్యభర్తల బంధం పలచబడుతుందనేది జగమెరిగిన సత్యమే. మరి కొందరు కట్నం కోసమే పెళ్లి చేసుకుంటున్నారా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. భార్యను అదనపు కట్నం తేవాలని భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేసి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

జోధ్‌పూర్‌ జిల్లాలోని కరిసాత్ గ్రామానికి చెందిన విరాట్ సింగ్‌కు అదే గ్రామానికి చెందిన సునందరాణితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురానికి గుర్తుగా ఓ కుమారుడు జన్మించాడు. అయితే పెళ్లైన కొద్ది రోజులు భార్యను బాగానే చూసుకున్న విరాట్ సింగ్.. ఆ తర్వాత భార్యను అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు దిగారు. మొదట భర్తను సర్ధి చెప్పుకుంటూ వచ్చిన భార్య ఆ తర్వాత ఇవన్నీ కామనే అని పట్టించుకోవడం మానేసింది. సునందరాణి వైఖరికి మరింత రెచ్చిపోయిన భర్త ఆమెను బెదిరించడం, కొట్టడం ప్రారంభించాడు. అలా ప్రతిరోజు ఆమెపై దాడి చేస్తూ చిత్ర హింసలకు గురి చేశాడు. మంగళవారం రాత్రి బెడ్ రూంలో మరోసారి జరిగిన గొడవలో అతడి చేసిన దాడిలో భార్య సునందరాణి ప్రాణాలు విడిచింది. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురిని అల్లుడే హత్య చేశాడని మృతురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ సేకరించారు. అనంతరం కేసునమోదు చేసి విరాట్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

Next Story