రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్

by Batti.Sumithra |

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి హన్మంతరావు ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి హన్మంతరావు ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్ అనే ఇద్దరు నిందితులు ఒడిశాలోని రాయగడలో ఈ ఎండు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్ఐ విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బలవంతరావు, ఫరూఖ్, సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన తదితరులు పాల్గొన్నారు.

Next Story