యోగా టిప్.. మయూరాసనం ఎలా చేయాలి?

by Javid Pasha |
యోగా టిప్.. మయూరాసనం ఎలా చేయాలి?
X

దిశ, ఫ్యూచర్: యోగాలోని 'మయూరాసనం' వేయడానికి ముందుగా రెండు మోకాళ్లను నేలపై ఆనించి ప్రార్థన చేసినట్లు కూర్చోవాలి. ఆ తర్వాత రెండు అరచేతులను పూర్తిగా నేలపై ఆనించాలి. ఈ దశలో మీ చేతివేళ్లు వెనుకకు తిరిగి ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత నెమ్మదిగా మోచేతులను వంకర చేస్తూ పొట్టను మోచేతులపై పెట్టాలి. రెండు కాళ్లను వెనకకు సమానంగా దూరం జరిపి స్ట్రెయిట్‌గా ఉంటేటట్లు చూసుకోవాలి. ఆ తర్వాత పూర్తి శరీరాన్ని మోచేతులపై బ్యాలెన్స్ చేస్తూ పైకి లేపాలి. బాడీ మొత్తం భూమికి సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలా సాధ్యమైనంత సేపు ఉండి, మళ్లీ విరమించుకునేముందు మెల్లగా మోకాళ్లను మడిచి భూమిపై పెడుతూ.. చేతులను భూమిపై నుంచి తీసివేసి మమూలు స్థితికి చేరుకోవాలి.

ఉపయోగాలు:

* మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరం.

* భుజాలు, మణికట్టు, మోచేతులు శక్తివంతగా తయారవుతాయి.

* కడుపుకు సంబంధించిన అన్ని వ్యాధులకు చెక్ పెడుతుంది.

* ఉదర అవయవాలను చైతన్యవంతం చేస్తుంది.

* వాత వికారములను నివారించును.



Next Story

Most Viewed