'ఖాకీ'ల కోటలో ఆనందాల హేళ

by S Gopi |   ( Updated:2022-03-18 07:10:17.0  )
ఖాకీల కోటలో ఆనందాల హేళ
X

దిశ, పాలమూరు: ఖాకీల కోటగా చెప్పుకునే పాలమూరు పోలీస్ హెడ్ క్వాటర్స్ లో హోళీ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. బ్యాండు మేళాలు.. నృత్యాలు... రంగులు.. నీటి జల్లులై కురవంగా.. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా తమ సిబ్బందితో కలిసి వేడుకలలో డోలు మ్రోగిస్తూ చేసిన హంగామా అందరిలో ఉత్సాహం నింపింది. అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు శ్రీనివాసులు, కిషన్ సిబ్బందితో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఎస్ఐలు సురేష్, శ్రీనివాస్, అప్పలనాయుడు, రాజేశ్వర్, హనుమప్ప, మహేశ్వర్, అశోక్, రవికుమార్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పోలీస్ అధికారులు, సిబ్బందిలో నూతన ఆనందాలను నింపాయి. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ, అదనపు ఎస్పీ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed