చంద్రబాబు చేతి వేలికి మైక్రోచిప్.. ఆ హైటెక్ రింగ్ రహస్యమిదే!

by Disha Web |
చంద్రబాబు చేతి వేలికి మైక్రోచిప్.. ఆ హైటెక్ రింగ్ రహస్యమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ లేనిది చేతికి ఉంగరాలు పెట్టుకొని సమావేశంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణతో ఎంతో సింపుల్‌గా కనిపించే ఆయన.. ఎలాంటి ఆభరణాలు కానీ.. ఉంగరాలు కానీ ధరించడానికి ఇష్టపడరు. కానీ, సడన్‌గా మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో చేతి వేళ్లకు ఉంగరాలు ధరించి కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుండగా.. తాజాగా.. స్వయంగా చంద్రబాబే ఉంగరం ధరించడంపై స్పందించారు. గురువారం పాల్గొన్న ఓ సమావేశంలో హైటెక్ రింగుపై పార్టీ కేడర్‌కు వివరించారు. ఇది ఆడంబరాలకు పెట్టుకున్న ఉంగరం కాదని క్లారిటీ ఇచ్చారు. ఆ హైటెక్ రింగ్‌లో మైక్రోచిప్ అమర్చినట్లు తెలిపారు. దీంతో ఆ ఉంగరం తన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తుందని వివరించారు. నిత్యం తన ఆరోగ్య పరిస్థితిని కంప్యూటర్‌కు పంపిస్తుందని వెల్లడించారు. దానిని బట్టి వైద్యులు తనకు సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచనలు చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed