మానుకోటలో హైటెక్ వ్యభిచారం.. అంతా వాట్సాప్ లోనే..

by Mahesh |
మానుకోటలో హైటెక్ వ్యభిచారం.. అంతా వాట్సాప్ లోనే..
X

దిశ, మహబూబాబాద్: పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. బతకడానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. కానీ కొంతమంది వ్యభిచారం లోకి దిగి తప్పులు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలు నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. టీనేజ్ అమ్మాయిలకు డబ్బు ఎర చూపి ఈ వృత్తి లోకి లాగుతున్నారు. విటుల నుండి భారీగా డబ్బులు గుంజుతున్నారు. గతంలో జిల్లా కేంద్రం శివారులో నడిచే ఈ వ్యభిచార గృహాలు, ప్రస్తుతం జిల్లా కేంద్ర నడిబొడ్డులో పోలీసులకు అనుమానం రాకుండా నిర్వహిస్తున్నారు.

అంతా.. వాట్సాప్ ద్వారానే..

నిర్వాహకులు తమ పర్మనెంట్‌ కస్టమర్లకు వాట్సప్‌ ద్వారా యువతుల ఫోటోలు పోస్ట్‌ చేసి విటులను ఆకర్షిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. విటుల్లో రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యాసంస్థల కరస్పాండెంట్లు ఉన్నట్లు సమాచారం. ఫ్యామిలీతో ఉన్నట్లు కిరాయికి ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతూ, పోలీసుల కళ్లు కప్పుతున్నారు.

వలలో పడుతున్న యువకులు, యవతులు..

వ్యభిచారం పట్టణ కేంద్రంలో ఎక్కువ అవుతుండటంతో యువకులు, ఉన్నత చదువులు అభ్యసించిన విద్యార్థులు కూడా ఈ రొంపిలోకి దిగుతున్నారు. యువతులు సైతం నిర్వాహకుల మాయ మాటలకు, డబ్బుల ఆశకు తలోగ్గుతున్నారు.

పోలీసుల రైడింగ్..

గత కొన్ని నెలల క్రితం జిల్లా పోలీసులు పక్కా సమాచారం మేరకు పలు వ్యభిచార గృహాల పై రైడింగ్ చేసి మహిళలను, విటులను అదుపులోకి తీసుకున్నారు.జిల్లా కేంద్రంలో ఈ దందా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది.జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి యువతీయువకుల జీవితాలను గాడి లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story