తెలంగాణకు భారీ వర్ష సూచన

by Muthe.Rajitha |

నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకోగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) తెలియ జేసింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకోగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(IMD) తెలియ జేసింది. మంగళవారం సాయంత్రం నుండి రాత్రి వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు (Intense Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Isolated Rains) కురవవచ్చని సూచించింది.

ఇక సాయంత్రం 4 గంటల్లో సిద్దిపేట, జనగామ, హన్మకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల, నల్గొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) తెలిపింది. అయితే ఈ వర్షపాతం 15 నుండి 20 మిల్లీమీటర్ల లోపే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే.. నగరంలో ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

Next Story