హైదరాబాద్ ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరిక..

by Dishanational2 |
హైదరాబాద్ ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరిక..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు వరుణగడం పొంచి ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో రాగల మూడు రోజులపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరీ ముఖ్య దీని ప్రభావం ఉత్తర తెలంగాణ మీద పడనుందంట. అందువలన ఆ ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో కంభ వృష్టి వర్షం పడే అవకాశం ఉందని నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఫోన్‌లో హలో అంటాం కదా... ఇంతకు హలో అంటే అర్థం తెలుసా...?

టాలెంట్ ఉండాలి బ్రదర్.. విజయ్‌ దేవరకొండకు బండ్ల గణేశ్ కౌంటర్


Next Story