భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత

by Disha Web Desk 13 |
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత
X

దిశ, అచ్చంపేట: నాటుసారా, నల్ల బెల్లాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం విదితమే. అయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా నాటు సారా బెల్లం హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాలకు అర్ధరాత్రి లో చేరుతున్నది. జిల్లా ఎక్సైజ్ శాఖ స్పెషల్ పార్టీ సీఐ పరమేశ్వర్ గౌడ్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి లో అక్రమంగా అశోక్ లీలాండ్ వాహనం లో తరలించేందుకు సిద్ధం గా ఉన్న 2400 కేజీల సుమారు 40 క్వింటాళ్ల నల్ల బెల్లం మరియు 100 కేజీల పటిక ను ఆబ్కారీ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. పట్టు బడిన నల్ల బెల్లం ను అచ్చంపేట ఆబ్కారీ పోలీసులకు అప్పజెప్పారని వివరించారు.

నల్ల బెల్లం తో పాటు పట్టుబడిన ఎరుపుల లింగం మరియు రాత్లావత్ ముఖేష్ లను వ్యక్తులను ఆ బెల్లాన్ని ఎవరు తెప్పించారు ? ఎక్కడికి తీసుకుపోతున్నారు ? అని ఎక్సైజ్ పోలీసులు వారిని విచారించగా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బొడ్కా నాయక్ తెమ్మ నాడని, గత రెండు రోజుల నుండి ఒక ఫోన్ నెంబర్ తో మాతో 20 సార్లు టచ్ లో ఉన్నాడని అని వారు వివరించారని ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన ఇద్దరితో పాటు బొడ్కా నాయక్ లపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ దిశకు చరవాణి ద్వారా వివరించారు.

అసలు నేరస్తుడిని తప్పించే ప్రయత్నం ?

అక్రమంగా సరఫరా చేస్తున్న నల్లబెల్లం పట్టుబడిన కేసులో అసలు నేరస్తులను తప్పించే ప్రయత్నం ఎక్సైజ్ శాఖ ప్రయత్నిస్తుందని రక్షణ శాఖ అధికార పార్టీకి చెందిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తూ న్నారు. అధికార పార్టీ నేత అండదండలతో ఈ బెల్లం వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోందని అతని కేసు నుoచి తపించి అమాయక యువకులపై కేసులు నమోదు చేసి అసలు నిందితులను వదిలి పెడుతున్నారు ఆ శాఖ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story