- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హంస గీతం

X
వసంతం కళకళలాడుతుంది
రజనీకరుని వజ్రపు రజం
ప్రభాతాన దిద్దబడిన ఇంటిముందు ముగ్గులా
చైత్ర మధూళిక
క్రొత్తదనపు కవన స్వరం భావ వీచికై
మదిని తడుతుంది నవగానతరంగంలా
వలపు పూగుత్తుల
వేకొమ్మల పట్టుకు ఊగిసలాడు రసగీతికల
కోయిల కిలకిలలలా
శ్రవణ రాగమై
సవ్వడిచేసే గువ్వల మువ్వలై
యవ్వన ఎద పూచిన అవనికన్న మామిడిలులా
రుతు వర్షాగమనంకై
నీలాకాశంవైపు ఎదురుచూచు
పూరాశుల నేలతల్లి పచ్చదనపు పసిరికలా
నీచపు గుణాలు వదిలి
సమభావ సంస్కృతి
విరిధర్మ ఆకృతి చేర్చి
నిమ్న భావాల జీవనం
మానవతా పరిమళమై హసించాలని, ఎదురుచూచే
పంచాంగపు ఆశా స్వర గీతికలా
వెన్నెల గంధంలో చెమ్మగిల్లిన
వసంత వయ్యారి
నా కోసం సక్రమంగా ఋతు స్వరన్యాసం చేయాలని
బ్రహ్మ మధనంలో
మధు కమలం
నాకోసం సక్రమంగా కాలాన్యాసం గావించాలని
హంస గీతం పాడుతున్నా
వసంతం కళకళలాడుతుందని, ఇలా
డా. బాలాజీ దీక్షితులు పి.వి
8885391722
Next Story