వీడిన మిస్టరీ: పెళ్లైనా.. ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. చివరకు అలా హత్య

by Dishanational2 |
వీడిన మిస్టరీ: పెళ్లైనా.. ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. చివరకు అలా హత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ గుట్టైనా సరే ఎప్పుడో ఒకసారి బయట పడుతుంది అంటారు. అలా ఓ మహిళ ఒకరిని వివాహం చేసుకుని మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఓ అమాయకుడి హత్యకు కారణం అయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరు జిల్లా‌కు చెందిన రవికిరణ్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే చివరకు ఆ ప్రేమే యువకుడి మరణానికి కారణం అయ్యింది. మూల్పూరుకు చెందిన రవికిరణ్‌ గత నెల 20వ తేదీ నుంచి కనబడకుండా పోవడంతో కుటుంబసభ్యులు అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి హత్యకు గురై ఉంటాడన్న అనుమానం రావడంతో విచారణాధికారి సీఐ కల్యాణ్‌రాజు కేసుపై మరింత శ్రద్ధ పెట్టారు. తెనాలికి చెందిన రౌడీ షీటర్‌ సముద్రాల పవన్‌కుమార్‌ అలియాస్‌ లడ్డూ, మరి కొందరు హత్య చేసి ఉంటారని అనుమానంతో విచారణ కొనసాగించారు. చివరకు పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో రవికిరణ్ ప్రియురాలి హస్తం ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే రవికిరణ్ ప్రియురాలికి ఇదివరకే పెళ్లికాగా, లడ్డు అనే మరో అబ్బాయితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఇద్దరితో సీక్రేట్‌గా లవ్ ట్రాక్ నడిపిస్తుంది మహిళ. అయితే చివరకు లడ్డు అనే యువకుడికి కిరణ్ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడి.. కిరణ్ అనే అబ్బాయి ప్రేమ అంటూ విసిగిస్తున్నాడని అబద్ధం చెప్పింది. దీంతో కోపోద్రీక్తుడైన లడ్డు తన స్నేహితులతో కలసి కిరణ్ పై అటాక్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కల్యాణ్‌రాజు తెలిపారు.

Read Disha E-paper

Next Story

Most Viewed