- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
జూలై 18 నుంచి స్థానిక డైరీ, వ్యవసాయ ఉత్పత్తులు సహా కొన్ని వస్తువులు ఖరీదు కానున్నాయి..!

చండీగఢ్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సమావేశంలో చివరిరోజున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కెంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, జూలై 18 నుంచి కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లు పెరగనున్నాయి. ఇందులో కొన్ని కొత్త ఉత్పత్తులు పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. బ్రాండెడ్ కాని ప్యాక్ చేసిన(స్థానిక) డైరీ, వ్యవసాయ ఉత్పత్తులను 5 శాతం పన్ను రేటు శ్లాబ్‌లోకి తెచ్చేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల కమిటీ సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేట్ల హేతుబద్దీకరణ, మినహాయింపులను అమలు చేసేందుకు జూలై 18వ తేదీని ఖరారు చేశారు.
దీని ప్రకారం, పనీర్, లస్సీ, మజ్జిగ, ప్యాక్ చేసిన పెరుగు, గోధుమ పిండి, ఇతర తృణ ధాన్యాలు, తేనే, అప్పడాలు, ఆహార ధాన్యాలు, మాంసం, చేపలు(ఫ్రోజెన్‌వి తప్ప), మరమరాలు, బెల్లం వనంటి ముందు ప్యాకేజ్ చేసిన పదార్థాలు, లేబుల్ చేయబడిన అగ్రి ఉత్పత్తులు జూలై 18 నుంచి ఖరీదు కానున్నాయి. ప్రస్తుతం బ్రాండెడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ అమలు కానుంది. అయితే, ప్యాక్ చేయని, లేబుల్ లేని వస్తువులకు పన్ను మినహాయింపు ఉంది. కిచెన్ వేర్ వస్తువులపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరగనుంది. కాగా, 2017, జూలై 1న జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ సమయంలో జీఎస్టీ అమలు వల్ల ఉత్పన్నమయ్యే ఆదాయ నష్టాన్ని భరించేందుకు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఈ అంశంపై జీఎస్టీ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.