వాట్సాప్ గ్రూప్‌‌ మెంబర్ల మెసేజెస్.. అడ్మిన్‌కు డిలీట్ పర్మిషన్

by Disha Web Desk 7 |
వాట్సాప్ గ్రూప్‌‌ మెంబర్ల మెసేజెస్.. అడ్మిన్‌కు డిలీట్ పర్మిషన్
X

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్‌ త్వరలోనే తాము నిర్వహిస్తున్న గ్రూప్స్‌పై మరింత నియంత్రణ పొందే అవకాశాన్ని పొందనున్నారు. ఈ మేరకు గ్రూప్‌లోని ప్రతి సభ్యుడి మెసేజ్‌ను డిలీట్‌ చేసే అధికారం కలగనుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.17.12(ఇది టెస్టర్స్ చిన్న సమూహానికి అందించబడుతుంది) కోసం వాట్సాప్ బీటాలో గుర్తించబడింది. ఇది ప్రాథమికంగా గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ ఇన్‌కమింగ్ సందేశాన్ని తొలగించేందుకు గ్రూప్ అడ్మిన్‌ను అనుమతిస్తుంది. ఆ తర్వాత, అడ్మిన్ ద్వారా గ్రూప్ సభ్యులకు అందరికీ మెసేజ్ డిలీట్ చేసినట్లు చాట్‌లో తెలియజేయబడుతుంది. కాగా ఫేక్ న్యూస్, ఇతర సమస్యాత్మక మెసేజెస్/ఫార్వార్డ్స్ వ్యాప్తి నియంత్రణలో సాయపడగలదని భావిస్తున్నారు.

మరో అద్భుతమైన ఫీచర్

స్థానికీకరించిన యాప్‌లో ప్రకటనలను అందించడానికి వాట్సాప్ ఒక మార్గాన్ని అభివృద్ధి చేస్తోందని WABetaInfo గుర్తించింది. యూజర్లు తమ ప్రస్తుత వాట్సాప్ వెర్షన్‌లో కొత్తగా ఏం మారిందనే విషయాన్ని ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌లో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి టిప్స్, ట్రిక్స్ షేర్ చేసేందుకు కూడా ఈ ఫీచర్ అవకాశం కల్పించనుండగా.. ఈ ప్లాట్‌ఫామ్‌లో సెక్యూరిటీ, ప్రైవసీ గురించిన సమాచారాన్ని పంపేందుకు మాతృ సంస్థ Metaను అనుమతించవచ్చు.

ఈ చాట్‌లోని సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడినప్పుడు చదవడానికి మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా వినియోగదారులు చాట్‌ను డిస్ట్రబ్‌గా అనిపిస్తే దాన్ని బ్లాక్ చేయవచ్చు. ఇప్పటికీ డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్న ఈ రెండు ఫీచర్లు ఎప్పుడు విడుదల చేయబడతాయో క్లారిటీ లేదు.



Next Story

Most Viewed