పుడమిని కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు అందిద్దాం : సద్గురు జగ్గీ వాసుదేవ్

by Disha Web |
పుడమిని కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు అందిద్దాం : సద్గురు జగ్గీ వాసుదేవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ కోరారు. 'సేవ్ సాయిల్'పేరిట నిర్వహిస్తున్న ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణలోకి ప్రవేశించగానే పచ్చదనం ఆకర్షించిందన్నారు. వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోందన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో మొక్కలను నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని.. వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందిద్దాని ఆకాంక్షించారు. అనంతరం సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ప్రభుత్వ సలహాదారు ఆర్. శోభ, పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి డీఎఫ్ఓ జానకిరామ్, ఎఫ్ఆర్వో విష్ణు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు కె.కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story