- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలి:మంత్రి పొంగులేటి
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలి అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు

దిశ,సత్తుపల్లి: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలి అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎండి రెహనా కమల్ పాషా, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి సత్తుపల్లి పట్టణ శివారులోని వేశ్య కాంతల చెరువు భూమిని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన తీరును రెవెన్యూ అధికారులు మంత్రి పొంగులేటికి వివరించారు.
రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ భూమిపై నిష్పక్షపాతంగా సర్వే చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూమి పేదలకు పంచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూమి అయితే లబ్ధిదారులకు ఇవ్వండని, ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి సరిహద్దులు నిర్ధారించి ఫెన్సింగ్ వేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, జేఈ పలువురు ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.






