ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 1,663 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 4 |
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 1,663 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ఇంజినీరింగ్ నిరుద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభవార్త తెలిపింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,663 ఖాళీల భర్తీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్)లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ)లో 284 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ హెచ్‌వోడీలో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో 88 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు పోలీస్, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. వీటితో కలిపి మొత్తం ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed