- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
నడిరోడ్డుపై పిచ్చ కొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాల సమీపంలో ఇద్దరు విద్యార్థినిలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. నలుగురు చూస్తున్నారనే విచక్షణ మరచిపోయి జుట్టుపట్టుకుని దాడి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కళాశాల తరగతి గదిలో ఏమైందో తెలియదు కానీ కళాశాల వదిలిన వెంటనే బయటకు వచ్చిన విద్యార్థినిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముష్టి యుద్ధానికి దిగారు. అయితే ఎందుకు కొట్టుకున్నారో అనేది మాత్రం తెలియడం లేదు. అమ్మాయిలు ఇద్దరు కొట్టుకుంటుండగా మరో విద్యార్థిని విడదీసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు కొట్టుకున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు వీధి పోరాటాలకు దిగడం.. ధర్నాలు చేయడం చూశాం కానీ ఇలా ముష్టి యుద్ధానికి దిగడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యార్థిని దాడి చేసుకుంటున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.