'వైద్యుల నిర్లక్ష్యమే పాప మరణానికి కారణం'

by Web Desk |
వైద్యుల నిర్లక్ష్యమే పాప మరణానికి కారణం
X

దిశ,కేసముద్రం : కేసముద్రం మండలం, పెనుగొండ గ్రామం శివారు కట్టు గూడెంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అన్నపూర్ణ (13) మరణించింది. దీనికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పాప భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించకపోవడంతోనే అనేక మంది ప్రజలు, చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధికి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడంలో వైద్యులు విఫలం చెందారని విమర్శించారు. జిల్లాలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని మానుకోటలో కిడ్నీ వ్యాధికి సంబంధించిన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆయన వెంట మార్కెట్ మాజీ చైర్మన్ శశి వర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed