తుర్కపల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

by Batti.Sumithra |

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తుర్కపల్లిలో గంజాయి ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తుర్కపల్లి ఎస్‌ఐ మహమ్మద్ తఖియుద్దీన్ తన సిబ్బందితో కలిసి మంగళవారం కాలువ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 250 గ్రాముల గంజాయి లభించింది.

పోలీసుల విచారణలో నిందితులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన గిరిమిల్ల సాయి మధు నుంచి గంజాయిని కొనుగోలు చేసి తుర్కపల్లి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో గిరిమిల్ల సాయి మధు (20), పసుల లింగస్వామి (19), సయ్యద్ జావీద్ (20)లను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి, ఒక పల్సర్ మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story