Bihar AIMIM: ఒవైసీకి బిగ్ షాక్.. ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జంప్

by Javid Pasha |
Four Of Five AIMIM MLAs Join RJD Party In Bihar
X

దిశ, వెబ్‌డెస్క్: Four Of Five AIMIM MLA's Join RJD Party In Bihar| బీహార్‌లో అసదుద్దీన్ ఒవైసీకి ఎదురుదెబ్బ తగిలింది. మజ్లిస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలల్లో నలుగురు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐఎంఐఎం పార్టీ కిషన్‌గంజ్, పూర్నియాలో రెండు సీట్లు గెలుచుకోగా, అరారియాలో ఒక సీటును గెలచుకుంది. బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 76 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 77 మంది ఉన్నారు. ఈ నాలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆర్జేడీకి 80 మంది ఎమ్మెల్యేల సంఖ్య చేరుకుంది. కాగా షానవాజ్‌ ఆలం, ఇజార్‌ ఆస్పీ, అంజర్‌ నైమి, అహ్మద్‌ సయ్యద్ ఆర్జేడీ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా వీళ్లు చేరడంతో 80 మంది ఎమ్మెల్యేలతో కూడిన బీహార్ అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది.

Next Story