సముద్రంలో వేటకు వెళ్లిన ఆ నలుగురు సేఫ్

by Disha Web |
సముద్రంలో వేటకు వెళ్లిన ఆ నలుగురు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: సముద్రంలో కనిపించకుండా పోయిన నలుగురు కృష్ణాజిల్లా మత్య్సకారులు క్షేమంగా బయటపడ్డారు. గురువారం ఫోన్ ద్వారా బంధువులకు జాలర్లు సమాచారం అందించారు. అమలాపురంలోని కొత్తపాలెం వద్ద ఉన్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల స‌ముద్రంలో చేపల వేట‌కు వెళ్లిన న‌లుగురు మత్య్సకారులు గల్లంతు కావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్యాంబెల్‌ నుంచి అంతర్వేదికి వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల వద్దనున్న సెల్‌ఫోన్‌లు పనిచేయకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం క్యాంబెల్‌ పేటకు చెందిన మత్స్యకారులు మరో బోటుతో సహాయంతో సముద్రంలో గాలించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు తాము క్షేమంగా ఉన్నామని జాలర్లే చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed