వారిద్దరితో గొడవ పడ్డాడు.. ఇక కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడు: పాక్ క్రికెటర్

by Disha Web Desk 19 |
Virat Kohli Tests Corona Positive
X

దిశ, వెబ్‌డెస్క్: రన్ మెషిన్‌గా పేరుగాంచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గత కొంత కాలంగా ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కోహ్లీ తన క్రికెట్ జీవితంలోనే ఇప్పటి వరకు ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొలేదంటే అతిశయోక్తి కాదు. పరుగుల వరద పారించే విరాట్.. ప్రస్తుతం భారీ స్కోర్లు చేయడంలో విఫలం అవుతున్నాడు. కోహ్లీ సెంచరీ చేయక దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోందంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం విరాట్ ప్రదర్శన ఏ విధంగా సాగుతోందో అని.. దీనితో కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్, విరాట్‌కు అండగా నిలిచాడు. అంతేకాకుండా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

ఓ ఇంటర్వ్యూలో లతీఫ్ మాట్లాడుతూ.. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని.. ప్రపంచ క్రికెట్‌కు అతడి అవసరం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ చాలా గొప్ప ప్లేయరని.. అయితే, ప్రతి క్రికెటర్ జీవితంలో ఇలాంటి ఎత్తుపల్లాలు ఉంటాయని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్టులో కోహ్లీ, ఇంగ్లాండ్ ప్లేయర్లు రూట్, లీచ్, బెయిర్ స్టోతో గొడప పడ్డాడని.. ఆ కసితో తిరిగి ఫామ్‌లోకి రావడానికి కోహ్లీకి ఇది ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా కోహ్లీ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యే నాటికి అతడు సచిన్‌, సర్ బ్రాడ్ మన్‌కు సమానంగా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.


Next Story

Most Viewed