Aligireddy Praveen Reddy: టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి మరో మాజీ ఎమ్మెల్యే

by Dishanational2 |
Ex MLA Aligireddy Praveen Reddy joined Congress in the presence of Mallikarjun Kharge
X

దిశ, వెబ్‌డెస్క్ : Ex MLA Aligireddy Praveen Reddy joined Congress in the presence of Mallikarjun Kharge| అధికార టీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014 లో వొడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీటి టీఆర్ఎస్ లో చేరారు. గత రెండు దఫాలుగా హుస్నాబాద్ టీఆర్ఎస్ టికెట్ సతీష్ కుమార్ కే వరిస్తుండటంతో కొంత కాలంగా టీఆర్ఎస్ లో ప్రవీణఅ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీలో ఉంటే తనకు మరోసారి కూడా టికెట్ దక్కదని భావించారో ఏమో కానీ ప్రవీణ్ కుమార్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. నేడు ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిశారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

హుస్నాబాద్ కాంగ్రెస్ లో చిచ్చు:

ఇదిలా ఉంటే ప్రవీణ్ రెడ్డి రాక హుస్నాబాద్ కాంగ్రెస్‌లో చిచ్చు రాజేస్తోంది. ఆయన రాకను నియోజక వర్గ ప్రస్తుత ఇన్ ఛార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉండగా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రవీణ్ రెడ్డిని తిరిగి ఎలా చేర్చుకుంటారని బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో స్పష్టత ఇచ్చాకే ప్రవీణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించాలని సన్నిహితుల వద్ద బొమ్మ శ్రీరాం చెప్పినట్లు సమాచారం. టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ప్రవీణ్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తే తన భవిష్యత్ కార్యచరణపై దృష్టి పెడతానని బొమ్మ శ్రీరాం కార్యకర్తల వద్ద చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిని రేపుతోంది.

ఇది కూడా చదవండి: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళసై స్పందన ఇదే


Next Story

Most Viewed