తెలంగాణలో నియంతృత్వ పాలన: కేసీఆర్‌పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్

by Disha Web |
తెలంగాణలో నియంతృత్వ పాలన: కేసీఆర్‌పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్
X

దిశ, తాండూర్: తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని జమ్మూ & కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా అన్నారు.తెలంగాణ సంపర్గ్ అభియాన్‌లో భాగంగా బీజేపీ మండలాధ్యక్షుడు మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూర్ మండలం ఐబిలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే తను ఎమ్మెల్యే కాక ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాడని, ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకుండా, ఆ వ్యాపారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకీ కార్యకర్తలే బలం అని, అలాంటి కార్యకర్తలను కాపాడుకుని, పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడంపైనే నాయకుల సామర్థ్యం ఆధారపడి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో 3తేదీన నిర్వహించనున్న బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, మండల ఇంచార్జి రాయలింగు, సీనియర్ నాయకులు ఏమాజీ, శేషగిరి, సుధీర్ గౌడ్, చిరంజీవి, శ్రీకృష్ణ దేవరాయలు, విష్ణుకళ్యాణ్, భాస్కర్ గౌడ్, సతీష్, శ్రీనివాస్, ప్రదీప్, మల్లేష్, సోమయ్య, రాకేష్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed