పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి!

by Disha Web Desk 19 |
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి!
X

దిశ, వెబె‌డెస్క్: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనితో ముందే అప్రమత్తమైన ఇమ్రాన్ ఖాన్ సభలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరగముందే.. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కోరాడు. ప్రధాని అభ్యర్థన మేరకు దేశాధ్యక్షుడు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించాడు. దీనితో ఇమ్రాన్ ఖాన్ బిగ్ రిలీఫ్ పొందాడు.

అయితే, పాకిస్థాన్ ప్రధానమంత్రిగా డి-నోటిఫై చేయబడిన ఇమ్రాన్ ఖాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ప్రతిపాదించారు. తాత్కలిక ప్రధానిని నియమించే వరకు ఇమ్రాన్ ఖాన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని రాష్ట్రపతి ఓ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని.. ఇతరదేశాల కుట్ర అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్థాన్‌లో మళ్ళీ ఎన్నికలు జరగాలని.. పాకిస్థాన్ ప్రజలు త్వరలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ రాజకీయాల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటున్నాయంటూ మాజీ ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు.


Next Story

Most Viewed