Credit Card ఆఫర్స్: ఆన్‌లైన్ షాపింగ్‌లో వీటిపై భారీ డిస్కౌంట్స్

by Disha Web Desk 17 |
Credit Card ఆఫర్స్: ఆన్‌లైన్ షాపింగ్‌లో వీటిపై భారీ డిస్కౌంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వివిధ రకాల ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్స్ అందిస్తు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఫెస్టివల్ సేల్‌ను తెచ్చింది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఆఫర్ సేల్ తీసుకొచ్చింది. షాపింగ్ చేసేటప్పుడు వస్తువులపై వివిధ రకాల బ్యాంకులు తమ కార్డ్స్‌ ద్వారా చేసే కొనుగోలులపై ప్రత్యేకంగా డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్ అందిస్తాయి. అయితే షాపింగ్ సీజన్ నడుస్తున్న టైం లో వినియోగదారులు ఏ బ్యాంకు నుంచి ఎలాంటి క్రెడిట్ కార్డులు ఉన్నాయి? వాటి ద్వారా లభించే బెనిఫిట్స్ ఏంటి? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ బ్యాంకు కార్డ్స్ ఏ ఏ ఆఫర్స్ ఇస్తున్నాయో ఒకసారి చూద్దాం..

Flipkart Axis Bank Credit Card:

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. Cure.fit, Swiggy, PVR, Uber వంటి ఫ్లిప్‌కార్ట్ భాగస్వామి వ్యాపారులపై 4% వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇతర కేటగిరీల్లో షాపింగ్ చేస్తే 1.5 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. యాక్టివేషన్ సమయంలో రూ.1,000 విలువైన వెల్‌కమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. కార్డు వార్షిక ఫీజు రూ. 500. KFC, TGIF, బెర్కోలు మొదలైన వాటితో సహా 4,000+ భాగస్వామి రెస్టారెంట్‌లలో 20% వరకు తగ్గింపు ఉంది.

HSBC Cashback Credit Card:

హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ. 750. దీంతో ఆన్‌లైన్‌ లావాదేవీలపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర అన్ని కొనుగోళ్లపై 1 శాతం క్యాష్‌బ్యాక్. విమానాల కోసం రూ. 2,000 స్పష్టమైన ట్రిప్ వోచర్, రూ. 250 స్విగ్గీ ఫుడ్ డెలివరీ వోచర్, అమెజాన్‌లో రూ.1,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ. 250 డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 500 విలువైన అమెజాన్ వోచర్, రూ. 1,500 విలువైన మింత్రా వోచర్, భాగస్వామ్య రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు 15% వరకు తగ్గింపు లభిస్తుంది.

Amazon Pay ICICI Credit Card:

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా Amazon కొనుగోళ్లపై ప్రైమ్ మెంబర్స్‌కి 5 శాతం, నాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. Amazon Payని చెల్లింపుగా ఉపయోగించినప్పుడు 100+ Amazon Pay భాగస్వామి వ్యాపారుల వద్ద 2% క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డు. ICICI బ్యాంక్ భాగస్వామి రెస్టారెంట్లలో 15% తగ్గింపు. అన్ని పెట్రోల్ పంపులలో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.

SBI Simplyclick card:

ఎస్‌బీఐ సింప్లీక్లిక్ కార్డు తీసుకుంటే మొదట రూ.500 అమెజాన్ గిఫ్ట్ కార్డు లభిస్తుంది. Amazon, BookMyShow, Cleartrip, Lenskart, Netmeds, UrbanClap వంటి భాగస్వాములలో ఆన్‌లైన్ షాపింగ్‌పై 10 రెట్లు రివార్డ్స్ లభిస్తాయి. ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తే ఐదు రెట్లు రివార్డ్స్ లభిస్తాయి. రూ. 500 - రూ. 3,000 మధ్య ప్రతి లావాదేవీకి 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. రూ. 1 లక్ష పైన ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే రూ. 2,000 ఇ-వోచర్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ వార్షిక ఫీజు రూ. 499.

Axis Bank Ace Credit Card:

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ అత్యుత్తమ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లలో ఒకటి. ఇది Google Pay ద్వారా బిల్లు చెల్లింపులు, DTH, మొబైల్ రీఛార్జ్‌లపై గరిష్టంగా 5% క్యాష్‌బ్యాక్. Swiggy, Zomato అండ్ Olaపై 4% వరకు అన్ని లావాదేవీలలో అత్యధికంగా 2% క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. కార్డు వార్షిక ఫీజు రూ. 499. 4,000+ రెస్టారెంట్‌లలో గరిష్టంగా 20% తగ్గింపు ఉంది. అన్ని పెట్రోల్ పంపులలో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.


Next Story

Most Viewed