ముంబైతో సహా మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్

by Dishanational1 |
ముంబైతో సహా మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత మూడు రోజులుగా వానలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పల్ఘర్ జిల్లాలో వరదల్లో గురువారం ఇద్దరు వ్యక్తులు కొట్టుకునిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో ఇళ్లు కూలి ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పలు మండలాల్లో 32 ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. గురువారం ఉదయం వరకు పల్ఘర్ జిల్లాలో 89 మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కర్ణాటకలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా పంజికల్ గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించినట్లు అధికారులు చెప్పారు. మరోకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులు ఆదేశించారు. ఇప్పటికే తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలకు సెలవు ప్రకటించారు.



Next Story

Most Viewed