గాలిలోని CO2ను శుభ్రపరిచే 'కారు'..

by Disha Web |
గాలిలోని CO2ను శుభ్రపరిచే కారు..
X

దిశ, ఫీచర్స్ : కర్బన ఉద్గారాలకు సంబంధించి కార్లు అధిక శాతం గ్రీన్ హౌజ్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఎలక్ట్రిక్ కార్లు ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నప్పటికీ ఇప్పటికే గాలిలో ఉన్న కార్బన్‌కు ఇది పరిష్కారాన్ని చూపదు. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్‌లోని ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 35 మంది విద్యార్థుల బృందం డ్రైవింగ్ చేస్తుండగా గాలిని శుభ్రపరిచే కాన్సెప్ట్ కార్‌ను అభివృద్ధి చేసింది.

ఐండ్‌హోవెన్ యూనివర్సిటీలో టీయూ/ఎకోమోటివ్ (TU/ecomotive) విభాగానికి చెందిన విద్యార్థి బృందం.. జూలై 21న జెమ్(Zem)గా పిలవబడే సస్టెయినబుల్ వెహికల్‌ను ఆవిష్కరించింది. 'డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరింగ్' ప్రక్రియను ఉపయోగించుకునే ఈ కారు.. అందులో నిల్వ చేసిన ఫిల్టర్ ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుది. ఈ మేరకు 20,000 మైళ్లు ప్రయాణించిన తర్వాత దాదాపు రెండు కిలోల కార్బన్ డయాక్సైడ్‌ను ఈ కారు శుభ్రం చేయగలదని విద్యార్థి బృందం పేర్కొంది. ఇది ఇప్పటికీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కాగా.. సాంకేతికతను మెరుగుపరిచేందుకు, అభివృద్ధి చేసేందుకు మరింత అవకాశముంది. ప్రత్యేకించి వాహనం మరింత ఎక్కువ CO2ను గ్రహించగలిగితే వాతావరణంలోని గ్రీన్‌హౌస్ వాయువు పరిమాణాన్ని తగ్గించడంలో తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'రాబోయే సంవత్సరాల్లో ఫిల్టర్ సామర్థ్యాన్ని పెంచుతాం. 3D ప్రింటింగ్ ప్రక్రియతో ఈ జెమ్ కారు(కారు బాడీ ప్యానెల్స్, స్ట్రక్చరల్ ఫ్రేమ్‌)ను రూపొందించడం వల్ల దాదాపుగా రెసిడ్యుల్ వేస్ట్ కూడా లేదు. అంతేకాదు 3డి ప్రింటింగ్ ప్రక్రియలో ఉపయోగించిన ప్లాస్టిక్‌‌ను కూడా రీసైకిల్ చేయడంతో పాటు ఇతర ఉత్పత్తుల కోసం ఉపయోగించవచ్చు.

- లూయిస్ డి లాట్, ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్




Next Story

Most Viewed