సెక్స్‌కు ఒప్పుకోకపోతే బూతులు తిట్టేవాడు.. ఎల్లెన్ రోనా

by Disha Web Desk 6 |
సెక్స్‌కు ఒప్పుకోకపోతే బూతులు తిట్టేవాడు.. ఎల్లెన్ రోనా
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ జానీ డెప్‌పై మాజీ ప్రియురాలు, నటి ఎల్లెన్ రోనా బార్కిన్ సంచలన ఆరోపణలు చేసింది. 1990లో కొంతకాలం జానీతో డేటింగ్ చేసిన ఎల్లెన్ ఇటీవల పరువునష్టం కేసులో అంబర్‌కు సపోర్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా తాజా ఇంటర్వ్యూలో.. జానీ తన నిజస్వరూపం బయటకు తెలియకుండా బాగానే మెయింటెన్ చేస్తున్నాడని కామెంట్ చేసింది. ఈ మేరకు తనతో సెక్స్ చేసేముందు శీతల పానియాల్లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడని, తను కూడా అతిగా తాగి బలవంతంగా శృంగారం చేసేవాడని తెలిపింది.

అంతేకాదు రాత్రుళ్లు తాగొచ్చి ఇంటి తలుపులు బాదేవాడన్న ఆమె.. తనతో లైంగికంగా కలవడం ఇష్టం లేక ప్రతిఘటిస్తే బూతులు తిట్టేవాడని వివరించింది. చిరవగా అతడిని పూర్తిగా హింసాత్మకమైన వ్యక్తిగా పేర్కొన్న నటి.. తనలాంటి ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించిన దుర్మార్గుడని తిట్టిపోసింది.



Next Story