ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సెంటర్లు.. చార్జింగ్ ప్రాబ్లమ్ కి చెక్

by Disha Web |
ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సెంటర్లు.. చార్జింగ్ ప్రాబ్లమ్ కి చెక్
X

దిశ, సిటీబ్యూరో : హలో.. మీరు ఎలక్ట్రిక్ వాహనం కొందామనుకుంటున్నారా? అయితే మధ్యలో చార్జింగ్ అయిపోతే ఎలా.. నగరంలో ఎక్కడా కూడా చార్జింగ్ చేసుకునే ఏర్పాట్లు లేవని బెంగ పడుతున్నారా? అయితే వెంటనే ఆ బెంగ మానండి..పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనేయండి. మీ లాంటి వారి కోసమే జీహెచ్ఎంసీ పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 230 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ తొలి దశగా హెచ్ఎండీఏ పరిధిలోన్ని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా తొలుత ప్రయోగాత్మకంగా వంద రీచార్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోజురోజుకి వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో నగరంలో వాయు, శబ్ధ కాలుష్యం కూడా గణనీయంగా పెరగటంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు ఎలక్ట్రిక్ వాహానాలను పరిచయం చేసిన సంగతి తెల్సిందే. పెరుగుతున్న కాలుష్యాన్ని, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్నిపెంచేందుకు సర్కారు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నందున, ఎలక్ట్రిక్ వాహానాలపై జనాల్లో క్రమంగా క్రేజీ పెరుగుతుంది. వాహన ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వలన ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహానాలపై చూస్తుండటంతో, రాబోయే రోజులన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దేనని గుర్తించిన, జీహెచ్ఎంసీ ముందస్తుగానే నగరంలో రీచార్జ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

ప్రోత్సహానికి ప్రత్యేక పాలసీ..

దేశంలో 2030 నాటికి అన్ని రకాల వాహనాలైన రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు ఎక్కువ శాతం వినియోగానికి తీసుకు రావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను కూడా రూపొందించిన సంగతి తెల్సిందే. ఎలక్ట్రిక్ వాహానాల ప్రత్యేక పాలసీలో భాగంగా ఐటి,ఎలక్ట్రానిక్, రవాణా,టి యస్ రెడ్ కో, ఎన్ పీడీసీఎల్, పట్ణణాభివృద్ది శాఖ, ఆర్టీసీల బాధ్యతలను కూడా పొందుపరిచారు. ఈ శాఖలు శాఖల వారీగా రీచార్జింగ్ సెంటర్ల ఏర్పాటులో భాగస్వాములు కానున్నాయి. ఇదే సంస్థలతో నగరంలోని పలు చోట్ల, హెచ్ఎండీఏ పరిధిలోని మరి కొన్ని చోట్ల ఈ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సెంటర్లలో ఏముంటాయ్?.. నిర్వహణ ఎలా ఉంటుంది?

వాహన రాకపోకలెక్కువగా ఉన్న కారిడార్‌లో, జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో వీటి ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రాంతాలను గుర్తించి, ఆ జాబితాను టీఎస్ రెడ్కోకు పంపనుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ద్వారా హెచ్ఏండీఏ పరిధిలో 100 లొకేషన్ జాబితా టీఎస్ రెడ్‌కోకు అందజేశారు. ప్రతి లొకేషన్‌లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఇక మున్ముందు సాధ్యాసాధ్యాలను బట్టి అవసరమైన చోట యుద్ద ప్రాతిపదికన పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంధన సంస్థలు కూడా క్రమంగా తమ అనుకూలతను బట్టి ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల వినియోగం, తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 14 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు టీఎస్ రెడ్‌కో చర్యలు చేపట్టనుంది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున, జీహెచ్ఎంసీకి ప్రతి మూడు నెలల కొకసారి చెల్లింపులు చేస్తారు. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు జీహెచ్ఎంసీతో టీఎస్ రెడ్ కో ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకోనున్నట్లు తెలిసింది. ఒక్కో సెంటర్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యత గల డీసీ-001(15 కేడబ్ల్యూ)కెపాసిటీ గల ఒక్కొక్క సెంటర్‌లో ఒకటి చొప్పున మొత్తం 14 లొకేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే ప్రాంతాల్లో సీ (122-150 కేడబ్ల్యూ) సామర్థ్యం గల యూనిట్లు రెండు చోపున టీఎస్ రెడ్ కో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

సెంటర్లను ఏర్పాటు చేయనున్న ప్రాంతాలివి

1. ఇందిరా పార్కు (ల్యాండ్ మార్కు పార్కింగ్ ప్లేస్)

2. కేబీఆర్ పార్క్ గేట్ నెం.1 ( పార్కింగ్)

3. కేబీఆర్ పార్క్ గేట్ నెం.3 (పార్కింగ్)

4. కేబీఆర్ పార్క్ గేట్ నెం.6 ( పార్కింగ్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సైడు)

5. ట్యాంక్ బండ్ (కందుకూరి వీరేశ లింగం విగ్రహం వద్ద)

6. బషీర్ బాగ్ రోడ్డు (ఒత్రిస్ రెస్టారెంట్ ఎదురుగా)

7. గన్ ఫౌండ్రీ (మహా బూబియా గర్ల్స్ జూనియర్ కళాశాల)

8. మున్సిపల్ పార్కింగ్, జీహెచ్ఎంసీ అబిడ్స్ ఆఫీసు

9. నానాక్ రామ్ గుడా (జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్)

10. మహావీర హరిన వనస్తలి నేషనల్ పార్క్ (అనన్య రిసార్ట్)

11. నాగోల్ బ్రిడ్జి (మెట్రో ఆఫీస్)

12. ఉప్పల్ (మెట్రో స్టేషన్ పార్కింగ్)

13. ఓవైసీ హాస్పిటల్ (ఇన్నర్ రింగ్ రోడ్డు సంతోష్ నగర్)

14. తాజ్ త్రై స్టార్ హోటల్ (ఎస్ డీ రోడ్డు, సికిందరాబాద్ )

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed