ముంబైని చేజిక్కించునేందుకు షిండేకు సీఎం : ఎంపీ సంజయ్ రౌత్

by Disha Web |
ముంబైని చేజిక్కించునేందుకు షిండేకు సీఎం : ఎంపీ సంజయ్ రౌత్
X

ముంబై: శివసేన నేత సంజయ్ రౌత్ మహారాష్ట్ర నూతన సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాల థాక్రే సృష్టించిన శిససేన నుంచి ముంబైను వశం చేసుకునేందుకే మహారాష్ట్ర సీఎం అయ్యారని ఆరోపించారు. 'షిండే శివసేనకు చెందినవాడు కాదని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో పౌర ఎన్నికలు జరగనున్న ముంబైలో శివసేనను ఓడించేందుకు షిండేను ఉపయోగించుకున్నారని ఇప్పుడు స్పష్టమైంది' అని అన్నారు. తనకు గువహతి ఎమ్మెల్యేల క్యాంపులో చేరేందుకు ఆహ్వానం అందిందని, అయితే తాను నిరాకరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ కొన్ని సార్లు వీగిపోయినప్పటికీ, ఇందిరా గాంధీ కాంగ్రెస్ ఇంకా కొనసాగుతుందని అన్నారు. అలాగే థాక్రే శివసేన కూడా ఉంటుందని చెప్పారు. ఈడీ తనను 10 గంటల విచారించిందని, అయితే కావాల్సిన సమాచారం మాత్రమే ఇచ్చానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎలాంటి భయాందోళనలు లేవని తెలిపారు. నిజం తనతో ఉందని చెప్పారు. ముంబై చావ్ల పునరాభివృద్ది సంబంధిత ఆర్థిక లావాదేవిలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం ఈడీ సంజయ్ రౌత్‌ను విచారించింది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed