- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'జెప్టో'కు ED నోటీసులు
క్విక్ కామర్స్ రంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న 'జెప్టో' వ్యవస్థాపకులు అదిత్ పలిచా, కౌవల్య వోహ్రాలకు ED సమన్లు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : క్విక్ కామర్స్ రంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న 'జెప్టో' (Zepto) వ్యవస్థాపకులు అదిత్ పలిచా, కౌవల్య వోహ్రాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జెప్టో సంస్థ త్వరలోనే స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు ఐపీవో (IPO) కి సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సమన్ల వివరాలను కంపెనీ తన రెగ్యులేటరీ డిస్‌క్లోజర్ (Regulatory Disclosure) లో భాగంగా ఐపీవో ఫైలింగ్ పత్రాల్లో అధికారికంగా వెల్లడించింది. జెప్టో సంస్థ గతంలో వివిధ దశల్లో సేకరించిన విదేశీ పెట్టుబడులు (FDI), కంపెనీ నిర్వహించిన ఫండింగ్ రౌండ్లు, అంతర్గత ఆర్థిక లావాదేవీలు, కంపెనీ కార్పొరేట్ స్ట్రక్చర్‌కు సంబంధించిన అంశాలపై స్పష్టత కోసం ఈడీ ఈ వివరాలను కోరినట్లు తెలుస్తోంది. ఈ సమన్లకు జెప్టో వ్యవస్థాపకులు అదిత్ పలిచా, కౌవల్య వోహ్రా సానుకూలంగా స్పందించారు.
దర్యాప్తు సంస్థ కోరిన విధంగా కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలను ఈడీ అధికారులకు ఇప్పటికే సమర్పించినట్లు ఐపీవో పత్రాల్లో పేర్కొన్నారు. భారతదేశంలో బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలతో పోటీపడుతూ జెప్టో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్. మార్కెట్ నుంచి భారీగా నిధులు సేకరించేందుకు ఐపీవో ప్రక్రియను ప్రారంభించిన తరుణంలోనే ఈ ఈడీ సమన్ల వ్యవహారం బయటకు రావడం గమనార్హం. అయితే కంపెనీ ఈ విషయాన్ని దాచకుండా ఐపీవో పత్రాల్లోనే పారదర్శకంగా వెల్లడించడంతో, ఇన్వెస్టర్లు దీనిని ఒక సాధారణ రెగ్యులేటరీ ప్రక్రియగా చూస్తారా, రాబోయే ఐపీవోపై ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






