- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
health: ఈ సమయాల్లో ఫుడ్ తీసుకుంటున్నారా.. ఈ వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే?

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది సమయానికి భోజనం(meal) తీసుకోవట్లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయంలోతప్పకుండా భోజనం చేయాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి భోజనాలను సమయానికి చేయడం వల్ల జీవక్రియ(Metabolism) సక్రమంగా జరుగుతుందని తరచూనిపుణులు చెబుతూనే ఉంటారు.
మార్నింగ్ 7 గంటలకు అల్పాహారం(breakfast) తిన్నట్లయితే.. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం మధ్య భోజనం చేయాలని అంటుంటారు. అల్పాహారం తర్వాత దాదాపు నాలుగు నుంచి 5 గంటల తర్వాత భోజనం చేయాలి. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేయడం సాధ్యం కాకపోతే ఆ రెండు భోజనాల మధ్య చిరుతిండిని ప్లాన్ చేసుకోవాలి.
ఒకవేళ వెయిట్ లాస్ (Weight loss) అయ్యేందుకు ప్రయత్నిస్తే కనుకనైట్ తర్వాత తినడం బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. రాత్రిళ్లు లేట్ గా తినడం వల్ల శరీరం రాత్రి తిన్న టైం నుంచి టైం క్యాలిక్యులేట్ (Calculate the time) చేసుకుంటుంది. దీంతో శరీరానికి టైం టేబుల్ అర్థం కాక కన్ ఫ్యూజ్ అవుతుంది. ఈ క్రమంలో మనిషి బరువు పెరుగుతాడు.
కాగా ప్రస్తుత రోజుల్లో సమయానికి ఫుడ్ తీసుకోకపోవడం వల్లే అన్ని రోగాలు దరిచేరుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి టైమ్ కు తింటే దాదాపు 70 శాతం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. నాణ్యమైన ఫుడ్(Quality food) తీసుకోవడం ఎంత అవసరమో సమయానికి ఆహారం తినడం అంతే ముఖ్యమని సూచిస్తున్నారు.
మనిషి హెల్తీగా ఉండాలంటే మార్నింగ్ 7 నుంచి 9 గంటల మధ్య అయినా ఆహారం తినాలి. 7 కు ముందే టిఫిన్ తీసుకుంటే అది హెల్త్ కు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనానికి గ్యాప్ చాలా వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మధ్యాహ్నం భోజనం 12 తర్వాతే తినాలని నిపుణులు అంటున్నారు. 10, 11 గంటలకే భోజనం చేస్తే మీ జీర్ణక్రియపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అలాగే నిద్రపోయే ముందు ఫుడ్ తీసుకోకూడదు. ఆహారం తిన్న వెంటనే పడుకోకూడదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపడంతో పాటు గ్యాస్(Gas), అజీర్ణం(indigestion), ఊబకాయం(obesity) ప్రమాదాన్ని పెంచడం వంటి సమస్యలు వస్తాయి. ఆహారానికి నిద్రకు కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.