- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Workout: వర్కౌట్ తర్వాత పీచు పండు తినండి.. ఈ సమస్యతో పాటు?

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా మనిషి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాడు. కాగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం హోల్తీ ఫుడ్‌తో పాటు.. ప్రతిరోజూ వర్కౌట్స్ అండ్ యోగా తప్పనిసరిగా చేయాలంటున్నారు నిపుణులు. వర్కౌట్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు తరచూ సూచిస్తూనే ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లైతే..
వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యమే కాకుండా.. రక్తాన్ని పంపింగ్ చేయడంలో సహాయపడుతుంది. వీటితో పాటుగా బరువు శిక్షణ వల్ల కండరాల బలం పెరుగుతుంది. అలాగే కీళ్ల ఆరోగ్యం, వాటర్ వర్కౌట్స్ చేయడం వల్ల కీళ్లపై ఎఫెక్ట్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కండరాలను పెంచుకునేటప్పుడు, శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కిలోజౌల్స్‌ను బర్న్ చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రధాన అనారోగ్యాల ప్రమాదం తగ్గుతుంది.
అయితే వర్కౌట్స్ అనంతరం పీచు పండు తింటే ఈ సమస్యను తరిమికొట్టొచ్చని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునేవారు ఈ పీచు పండును డైలీ వర్కౌట్స్ తర్వాత తింటే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే డయేరియా, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పీచ్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాగా ఈ పండు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. తద్వారా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ పీచు పండులో విటమిన్ సి, పొటాషియం, పోషకాలు దట్టంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పీచు పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచు పండులోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా నిరోధకతను పెంచడలో, వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని క్యాన్సర్లకు కారణమయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో, పొటాషియం రక్తపోటును నిర్వహించడానికి, దీనిలోని సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడటానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.