సరిహద్దు వివాదంపై చైనాతో చర్చించిన భారత్.. గంటసేపు..

by Dishafeatures2 |
సరిహద్దు వివాదంపై చైనాతో చర్చించిన భారత్.. గంటసేపు..
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండేళ్లుగా చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదం ముదురుతూనే ఉంది. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సరిహద్దు వద్దు ఆర్మీ దళాలను మొహరించాయి. ఇరువైపులా వేల సంఖ్యలో జవాన్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరుదేశాల మిలటరీ అధికారులు దాదాపు 9 సార్లు చర్చలు చేశారు. కానీ, అవన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే తాజాగా ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ‌తో సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జీ-20 సమావేశంలో కలిసి వీరిద్దరు సరిహద్దు విషయంపై చర్చించారు. ఈ చర్చలు దాదాపు గంటసేపు నడిచాయి. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను జయశంకర్ ట్విట్టర్ వేదికగా వివరించారు. 'భారత్, చైనా సరిహద్దు వివాదంపై చర్చలు దాదాపు గంటసేపు కొనసాగాయి. వీటిలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో అత్యుత్తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అంతేకాకుండా విద్యార్థులు, విమానాలు వంటి మరిన్ని ఇతర విషయాల గురించి కూడా చర్చించాం' అని జయశంకర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.



Next Story

Most Viewed