హెల్త్‌కేర్ బిజినెస్ కోసం Flipkart కొత్త యాప్

by Disha Web Desk 17 |
హెల్త్‌కేర్ బిజినెస్ కోసం Flipkart కొత్త యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart తన హెల్త్‌కేర్ బిజినెస్ కోసం ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ యాప్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు వారి ఇంటి వద్దకే మందులను సులభంగా అందించడానికి ఉపయోగపడుతుంది. యాప్ ద్వారా భారతదేశంలోని 20,000 పిన్ కోడ్‌లలో నాణ్యమైన, సరసమైన మందుల కోసం షాపింగ్ చేయవచ్చు. Flipkart Health+ యాప్ వినియోగదారులకు వారి సాంకేతిక నైపుణ్యం తో సంబంధం లేకుండా ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది. Flipkart Health+ యాప్ దేశవ్యాప్తంగా తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులతో సహా వివిధ ఆరోగ్య పరిస్థితుల కోసం మందులు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ రాబోయే నెలల్లో, వినియోగదారులకు టెలికన్సల్టేషన్, ఇ-డయాగ్నస్టిక్స్ వంటి ఇతర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే థర్డ్-పార్టీ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ హెల్త్+ ప్లాన్ చేస్తోంది. Flipkart Health+ యాప్ Google Play Store ద్వారా Androidలో అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో iOSలో అందుబాటులోకి రానుంది.

Next Story