రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం ఖాయం: డీకే అరుణ

by Disha Web Desk 19 |
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం ఖాయం: డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక నరేంద్ర మోడీ సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్ నినాదానికి బలం చేకూర్చిందని డీకే అరుణ పేర్కొన్నారు. ముర్ము విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రులతో కలిసి ఆమె ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గత రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో, ఒడిస్సాకు చెందిన ద్రౌపది ముర్మును ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల సమన్వయ కమిటీలో డీకే అరుణను సభ్యురాలిగా బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వరాష్ట్రం ఒడిస్సా నుంచి వచ్చిన ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము జీవితం ఆదర్శవంతమైనదన్నారు. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజ శ్రేయస్సు కోసం ఎలా శ్రమించాలో జీవించి చూపారని కొనియాడారు.


Next Story