అసోం సీఎం ఆశ్చర్యకర వ్యాఖ్యలు

by Disha Web |
అసోం సీఎం ఆశ్చర్యకర వ్యాఖ్యలు
X

గౌహతి: మహారాష్ట్ర రెబెల్ ఎమ్మెల్ లో గౌహతి పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేస్తున్న నేపథ్యంలో సీఎం బిస్వంత శర్మ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. మహా రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రంలో ఉన్న విషయం తనకు తెలియదని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అతిపెద్ద రాజకీయ పరిణామాలతో ఈశాన్య రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ఖండించారు. అసోంలో అనేక మంచి హోటళ్లు ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఉండొచ్చు. దానిలో ఎలాంటి సమస్య లేదు. అసోంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్న విషయం నాకు తెలియదు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ఉండవచ్చు' అని మీడియాకు తెలిపారు.


Next Story