రోజ్ వాటర్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతాయా.. ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

by Anjali |
రోజ్ వాటర్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతాయా.. ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?
X

దిశ, వెబ్‌డెస్క్: రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాగా దీన్ని చర్మ సంరక్షణకు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, జుట్టు సంరక్షణకు, పేగు సమస్యలను నిర్వహించడానికి కూడా వాడుతారు. రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.

మొటిమలు, దద్దుర్లు, ఎరుపు, చికాకులు వంటి వాటికి సహజ నివారణగా పనిచేస్తుంది. వీటితో పాటుగా.. రోసేసియా, తామర లేదా రోసేసియా వంటి వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ ఎన్నో అనారోగ్య సమస్యల్ని నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ ఎ, సి, డి, ఇ, బి3 ఉండే రోజ్ వాటర్ తీసుకుంటే.. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా ప్రతి రోజూ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజు తీసుకుంటే కడుపు జీర్ణక్రియ పరిపూర్ణ స్థితిలో ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే గొంతు నొప్పి ఉన్నవారు.. రోజ్ వాటర్‌ను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

రోజ్ వాటర్ చలికాలంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో మేలు చేస్తుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. వీటిలో ఉండే శక్తివంతమైన క్రిమినాశక లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి. రోజ్ వాటర్‌ను సహజ, ఔషధ చికిత్సలలో వాడుతారు. అంతేకాకుండా.. కండ్లకలకలు తగ్గడానికి కూడా మేలు చేస్తాయి. దీనిలో ఉండే క్రిమినాశక, అనాల్జేసిక్ లక్షణాలు కంటి వ్యాధుల్ని దూరం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story

Most Viewed