- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుడి భుజంలో పెయిన్ వస్తుందా.. లైట్ తీసుకుంటే అంతే సంగతి..?

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కుడి భుజం నొప్పి(right shoulder)కి కారణాలు అనేకం ఉండవచ్చు. కండరాలు, మృదులాస్థి క్షీణించడం(Atrophy of muscles and cartilage), పతనం, స్నాయువులు, కీళ్లు (Joints), పునరావృత కదలికలు(repetitive motions) వంటివి దీనికి కారణాలు. వీటితో పాటుగా పేలవమైన భంగిమ, షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్(Shoulder impingement syndrome), రొటేటర్ కఫ్ కన్నీళ్లు(Rotator cuff tears), ఆర్థరైటిస్(Arthritis) వంటివి. కాగా కుడి భుజం నొప్పిని తేలికగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
కొందరిలో ఈ నొప్పి తరచూ ఉంటుంది. కానీ చాలా మంది కుడి భుజంలో పెయిన్ వస్తే లైట్ తీసుకుంటూ ఉంటారు. లేకపోతే పెయిన్ కిల్లర్(Pain killer) వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ నొప్పి పిత్తాశయం(gall bladder)లోని రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. పిత్తాశయంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి(Accumulation of cholesterol), బిలిరుబిన్(Bilirubin), కాల్షియం(Calcium), లవణాల నిక్షేపాలు(Salt deposits) పేరుకుపోయి.. చిన్న రాళ్లలా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య తీవ్రతరం అయ్యే కొద్ది వికారం, పొత్తికడుపులో నొప్పి, జ్వరం(fever), మలం ముదురు రంగులోకి మారడం, కామెర్లు(Jaundice) వంటివి తలెత్తుతాయి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు మీరు ఈజీగా కనుగొనాలంటే ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు. తిన్న తర్వాత వెంటనే జీర్ణం అవ్వకపోవడం(Indigestion), పిత్త వాహిక(Bile duct)కు ఆటంకం కలగడం వంటివి సూచిస్తాయి. కాగా ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలని నిపుణులు సచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.