- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ మోటర్ బైక్‌లు పంపిణీ
by Jakkula.Mamatha |
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చేతుల మీదుగా సీఎస్ఆర్ నిధుల ద్వారా 50 మంది వికలాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు.

X
దిశ,డోర్నకల్: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చేతుల మీదుగా సీఎస్ఆర్ నిధుల ద్వారా 50 మంది వికలాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలో డోర్నకల్ పుర పరిధి నుంచి నలమాద పెంటయ్య, వీరన్న వికలాంగులు ద్విచక్ర వాహనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుడు పెంటయ్య మాట్లాడుతూ.. తమ దైనందిన జీవనంలో స్వయం సమృద్ధిని పెంపొందుటకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సహకారం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య సేవలు, ఇతర అవసరాల కోసం సులభంగా ప్రయాణించేందుకు ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీఎస్ఎఫ్ డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, డీఎఫ్ఓ బత్తుల విశాల్, డీవి రెడ్డి, స్కైలాబ్, వెంకటేశ్వర్లు, శైలజ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






